కృతి
సొంపైన మనస్సుతో ఇంపైన బంగారు
గంపలతో మంచి చంపకములను
చల్లరే రామచంద్రుని పైని పూల ..
1. పామరములు మాని ప్రేమముతో రామ
మనోహరుని పై తామర పూల .. చల్లరే
2. ధాత వినుతుడైన సీతాపతి పైన
చేతులార జాజి సంపెంగ పూల .. చల్లరే
3. అమిత పరాక్రమ ద్యుమణీ కులార్ణవ
విమల చంద్రుని పై హృత్కుముద సుమముల .. చల్లరే
4. ఎన్నరాని జనన మరణము లేకుండ
మనసార త్యాగరాజ నుతుని పైని పూల .. చల్లరే
భైరవి - ఆదితాళం
రామ కోదండరామ రామ కళ్యాణరామ .
రామ కోదండరామ రామ పట్టాభిరామ .. రామ
1. రామ సీతాపతి రామ నీవే గతి .
రామ నీకు మ్రొక్కితి రామ నీ చేజిక్కితి .. రామ
2. రామ నీకెవరు జోడు రామ క్రీగంట జూడు .
రామ నేను నీవాడు రామ నాతో మాటాడు .. రామ
3. రామ నీదొక్క మాట రామ నాకొక్క మూట .
రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట .. రామ
4. రామనామమె మేలు రామ చింతనె చాలు .
రామ నీవు నన్నేలు రామరాయడె జాలు .. రామ
5. రామ నేనెంతైనను రామ వేరెంచలేను .
రామ ఎన్నడైనను రామ పాయగలేను .. రామ
6. రామ విరాజితరాజ రామ ముఖజిత రాజ .
రామ భక్తసమాజ రక్షిత త్యాగరాజ .. రామ
కృతి
హరిదాసులు వెడలు ముచ్చట గని
ఆనందమాయే, దయాళూ .
1. హరిగోవింద నరహరి రామకృష్ణయని
వరుసగ నామముల కరుణతో జేయుచు .. హరి
2. సంగతిగాను మృదంగ ఘోషములచే
వూగుచు వీధుల కేగుచు మెరయుచు .. హరి
3. జ్ఞానముతో రామ ధ్యానముతో మంచి
గానముతో మేను దాన మొసంగుచు .. హరి
4. రాజరాజునిపై జాజులు చల్లుచు
రాజిల్లుచు త్యాగరాజునితో గూడి .. హరి
please translate or rewrite the same in english.
haridaasulu..
yamunaa kalyaani raagaM
haridaasulu ‘veDalE’ muchchaTa gani
aanaMdamaaye dayaaLO’
i’ve been searching for this kriti. i found it here.thanx for ur posting
convert in english please